Madhapur : మాదాపూర్ యూనియన్ బ్యాంక్‌లో భారీ చీటింగ్..!

Madhapur : మాదాపూర్ యూనియన్ బ్యాంక్‌లో భారీ చీటింగ్..!
ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ నకిలీ పత్రాలు సమర్పించి కోట్లాది రూపాయల రుణం తీసుకున్నారు కొందరు వ్యక్తులు.

హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్‌లో భారీ చీటింగ్ వెలుగుచూసింది. ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ నకిలీ పత్రాలు సమర్పించి కోట్లాది రూపాయల రుణం తీసుకున్నారు కొందరు వ్యక్తులు. ఆ పత్రాలతో ఇతర బ్యాంకుల్లోనూ రుణం పొందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే 52 కోట్ల మేర బ్యాంకును మోసం చేసినట్లు బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మోసానికి పాల్పడ్డది రాజకీయ నాయకుల అనుచరులుగా అనుమానిస్తున్నారు. ఐతే.. కేసు వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ బడా మోసంపై ఫిర్యాదు నిజమే కానీ ఇంకా అది దర్యాప్తు దశలోనే ఉందంటున్న పోలీసులు చెప్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story