ప్రభాస్ పేరుతో భారీ మోసం..

ప్రభాస్ పేరుతో భారీ మోసం..
సినిమా అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేయడం ఇండస్ట్రీలో సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.

సినిమా అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేయడం ఇండస్ట్రీలో సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో నటించేందుకు మంచి అవకాశామని, ఆసక్తి ఉన్నవారు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలంటూ అంటూ ఓ ముఠా ఔత్సాహికులను మోసం చేసింది. అయితే దీనికి గాను ముందుగా పేరు నమోదు చేసుకోవాలని, అందుకోసం కొంత మొత్తం చెల్లించాలని సూచించారు.

ఈ మేరకు ఓ ప్రొడక్షన్ కంపెనీ పేరుతో ప్రకటనను కూడా విడుదల చేశారు. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అని తెలియడంతో చాలా మంది ఔత్సాహికులు ముందు వెనుక ఆలోచించకుండా డబ్బును చెల్లించి నమోదు అయ్యారు. అయితే కొన్ని రోజులకి సదరు ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో మోసపోయామని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారట.. ముంబై కేంద్రంగా జరిగిన ఈ మోసం పైన పోలీసులు విచారణ చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story