AP : అనకాపల్లిలో భారీగా గంజాయి సీజ్

AP : అనకాపల్లిలో భారీగా గంజాయి సీజ్
X

ఏపీ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో పోలీసులు భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వి.మాడుగుల, కొత్తకోట పోలీస్ స్టేషన్ల పరిధిలో 448 కేజీల గంజాయి, రెండు కేజీల లిక్విడ్ గంజాయిని జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఓ లారీ, బొలెరో వాహనం, కారు, ద్విచక్రవాహనం, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుపడిన మత్తుపదార్థాల విలువ 21లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి తుని మీదుగా కేరళ రాష్ట్రానికి గంజాయి సరఫరా చేస్తున్నారన్న పక్కా సమచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు బృందాలుగా ఏర్పడి వి.మాడుగుల, కొత్తకోట సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఐదుగురు కేరళ రాష్ట్రానికి చెందిన వారి కాగా, ఒకరు చింతపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు చేసి ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా వారినీ అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు.

Tags

Next Story