Crime : భారీ చోరీ .. 20 తులాల బంగారం మూడు కిలోల వెండి ఎత్తుకెళ్లిన దుండగులు.

Crime : భారీ చోరీ .. 20 తులాల బంగారం మూడు కిలోల వెండి ఎత్తుకెళ్లిన దుండగులు.
X

శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. చిత్తారి సవితమ్మ ఇంటికి తాళం వేసి హైదరాబాదులో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్ళింది. తాళం వేసిన ఇంటిని గుర్తించిన దుండగులు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో దాచి ఉంచిన 20 తులాల బంగారం మూడు కిలోల వెండి, 20000 రూపాయల నగదు ఎత్తుకెళ్లిపోయారు. బుధవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించిన పొరుగింటి వారు సవితమ్మ వచ్చిందేమో అనుకున్నారు ఆమెను పలకరించి చూడగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీం ఆధారంగా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్ఐ లింగన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న వారే దొంగతనానికి పాల్పడ్డారా లేక ఇతరుల ప్రమేయం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story