ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మేడ్చల్ ఏఎస్ఐ

ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మేడ్చల్ ఏఎస్ఐ
X

మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ రావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. రూపాయలు 50 వేల లంచం తీసుకుంటూ అడ్డంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం దొరికాడు. మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏసీబీ దాడులు చేశారు. ఓ కేసుకు సంబంధించి స్టేషన్ బెల్ విషయంలో రూపాయలు 50 వేలు డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఎస్ఐ మధుసూదన్ ను విచారిస్తున్నారు. బాధ్యతగా ఉండాల్సిన ఖాకీల్లో కొందరు ఇలా లంచాలకు మరిగి పోలీసు శాఖకే మాయని మచ్చ తెస్తున్నారు.

Tags

Next Story