Eluru District : ఏలూరు జిల్లాలో మెడికల్ మాఫియా

Eluru District : ఏలూరు జిల్లాలో మెడికల్ మాఫియా
X

ఏలూరు జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోయింది. డాక్టర్ ప్రిస్కిప్షన్‌ లేకుండా నిషేధిత మందులు విచ్చలవిడిగా రాజ్యమేలుంది. కొయ్యలగూడెం లో మురళీకృష్ణ మెడికల్స్ లో డ్రగ్ ఇన్స్పెక్టర్ విస్తృత తనిఖీలు నిర్వహించి ఆరు రకాల మెడిసిన్ స్వాధీన పరుచుకొని షాప్ ను సీజ్ చేశారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ ఆలీ షేక్ బుట్టాయిగూడెం లో రెండు మెడికల్ షాపులు, కొయ్యలగూడెంలో ఒక మెడికల్ షాపు లక్ష్మీ దుర్గ మెడికల్ స్టోర్స్,కార్తికేయ మెడికల్ స్టోర్స్, సీజ్ చేసినట్లు తెలిపారు. తనిఖీలు చేయగా ఒక వ్యక్తి ముసుగు వేసుకొని కళ్లద్దాలు పెట్టుకుని బండిమీద తిరుగుతూ ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలో కూడా పలు మందుల షాపులకు నిషేధిత డ్రగ్స్ ( వయాగ్రా టాబ్లెట్, అబార్షన్ కిట్లు )ను అమ్ముతున్నట్లు సమాచారం తెలుసుకొని అతని వద్ద నుండి తనిఖీలు చేసి కొనుగోలు బిల్లు లేకుండా అబార్షన్కు సంబంధించిన కిట్లు మరియు వయాగ్రా టాబ్లెట్స్ భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇవి హైదరాబాద్ స్టాక్ పాయింట్ నుంచి తెప్పించుకుని వివిధ ఏరియాల్లోకి వెళ్లి షాపులకి అమ్ముతున్నారు. మరియు ఈ స్టాకు ఎక్కువగా Rmp & pmp లకు మరియు మెడికల్ షాపులకు విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు గుర్తించామని ఇవి సప్లై చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని దీనిపైన ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags

Next Story