Mehul Choksi Arrested : రూ.13వేల కోట్ల మోసం.. మెహుల్ ఛోక్సీ అరెస్టు

వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. భారత ఏజెన్సీలైన CBI, ED విజ్ఞప్తి మేరకు అతడిని అరెస్టు చేశారు. ఛోక్సీపై గతంలో ముంబైలో నాన్-బెయిలబుల్ వారెంట్లు నమోదయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకుని రూ.13వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు రాగా ఛోక్సీ, నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయారు. అతడి మేనల్లుడు నీరవ్ లండన్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం 65 ఏళ్ల మెహుల్ చోక్సీ అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛోక్సీ ఇండియాకు వస్తే ఎలాంటి ఫలితం ఉండదని, ఆయన ఆరోగ్యానికి మనమే ఖర్చు చేయాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్‌కు ఎగ్గొట్టిన 13 వేల కోట్ల రూపాయలను రాబడితే చాలు అని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com