వడ్డీ వ్యాపారి సిగ్గుమాలిన చర్య.. అప్పు చెల్లించలేదని భర్త కళ్లెదుటే భార్యపై..

వడ్డీ వ్యాపారి సిగ్గుమాలిన చర్య.. అప్పు చెల్లించలేదని భర్త కళ్లెదుటే భార్యపై..
డబ్బే పరమావధిగా బతుకుతుంటారు.. కొంచెం కూడా మంచి, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంటారు.

డబ్బే పరమావధిగా బతుకుతుంటారు.. కొంచెం కూడా మంచి, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంటారు.. తనకూ అమ్మ, అక్క, చెల్లి ఉంటారన్న ఇంగితజ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటారు. కనీస కనికరం లేకుండా తోటి మహిళ అని చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు.. అది కూడా ఆమె భర్త ఎదుటే.. సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన దుస్థితి కల్పించాడు.. జుగుప్సాకరమైన ఈ సంఘటన పూణెలోని హడప్సర్ లో చోటు చేసుకుంది.

అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని ఓ ప్రైవేట్ వడ్డీ వ్యాపారి ఆ వ్యక్తి ఎదుట భార్యపై అత్యాచారం చేశాడు.అంతే కాదు అతడే గొప్ప ఘన కార్యం చేసినట్లు, ఏం చేసినా తననెవడూ అనేవాడు లేడన్నట్లు నిందితుడు ఈ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ సంఘటన 2023 ఫిబ్రవరిలో పూణేలోని హదప్సర్ ప్రాంతంలో జరిగింది. ఈ కేసులో 34 ఏళ్ల వివాహిత ఫిర్యాదు చేసింది. దీని ప్రకారం నిందితుడు ఇంతియాజ్ హసిన్ షేక్ (వయస్సు 47)పై హదప్సర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి భర్తకు నిందితుడు డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఇస్తానన్న సమయానికి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేకపోయాడు. దీంతో నిందితుడు ఫిర్యాదిని, ఆమె భర్తను హడప్‌సర్‌లోని మదా కాలనీకి పిలిపించి చంపేస్తానని బెదిరించాడు. అనంతరం భర్త ఎదుటే అతడి భార్యను అత్యాచారం చేశాడు.

ఆ తర్వాత, నిందితుడు మహిళతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని డిమాండ్ చేశాడు. అయితే అందుకు మహిళ నిరాకరించడంతో నిందితుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ మహిళ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న హడప్సర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ఇంతియాజ్ హసిన్ షేక్‌ను అరెస్ట్ చేశారు.

గతేడాది పుణెలో వడ్డీ వ్యాపారుల ఒత్తిడితో సహకార శాఖ అధికారి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవార్ పేటలోని బాలాజీ హైట్స్ భవనంలోని తన నివాసంలో సహకార శాఖ అకౌంటెంట్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గణేష్ శంకర్ షిండే ముంబై నుంచి పూణెకు బదిలీ కోసం అధికారులకు లంచం ఇచ్చేందుకు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకున్నాడు. అది చెల్లించలేక, వడ్డి వ్యాపారుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Tags

Read MoreRead Less
Next Story