ఏలూరులో దారుణం.. 12రోజుల శిశువును చంపిన కన్నతల్లి

ఏలూరులో దారుణం.. 12రోజుల శిశువును చంపిన కన్నతల్లి
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 12 రోజుల పసికందును చంపిందెవరు..? నవమాసాలు కన్న తల్లే ఈ ఘుతాకానికి ఒడిగట్టిందా..? ఈ కోణంలోనే పోలీసులు విచారణ జరుపుతున్నారు..

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 12 రోజుల పసికందును చంపిందెవరు..? నవమాసాలు కన్న తల్లే ఈ ఘుతాకానికి ఒడిగట్టిందా..? ఈ కోణంలోనే పోలీసులు విచారణ జరుపుతున్నారు.. ఇప్పటికే ఈ కేసులో పలు ఆధారాలు సేకరించిన పోలీసులు తల్లే పసికందును హత్యచేసి ఉంటుందని అనుమానిస్తున్నారు.. తల్లి సీతామహాలక్ష్మిని స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని రేమెల్లెకు చెందిన హరికృష్ణ, సీతామహాలక్ష్మి దంపతులకు ఇటీవల పాప పుట్టింది. శిశువు అనారోగ్యంగా ఉండటంతో రెండురోజుల క్రితం ఏలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి చిన్నారి కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చేపట్టగా ఆస్పత్రి వెనుక భాగంలో ఉన్న వాటర్ ట్యాంక్‌లో పాప మృతదేహం కనిపించింది. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా.. తల్లి సీతామహాలక్ష్మే చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story