Rajahmundry :వ్యక్తితో సహజీవనం.. కన్నబిడ్డలకు విషమిచ్చి..

మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ మహిళ కన్నబిడ్డలకు విషమిచ్చిన ఘటన రాజమహేంద్రవరం పీఎస్ పరిధిలో జరిగింది. సీతానగరానికి చెందిన కె.లక్ష్మీ అనూషకు తాడేపల్లిగూడేనికి చెందిన రాముతో పదకొండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు.
అయిదేళ్ల క్రితం రాము ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఆమెకు పోలవరానికి చెందిన రామకృష్ణతో రెండో వివాహం చేశారు. వివిధ కారణాలతో భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. లక్ష్మీఅనూష తన ఇద్దరు పిల్లలతో కలిసి రాజమహేంద్రవరంలోని మల్లయ్యపేటలో నివసిస్తోంది.
ఈ క్రమంలో ఒంటరి జీవితం అనుభవిస్తున్న ఆమె మానసిక వేదన అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారనే ఆలోచనతో కుమార్తె చిన్మయి, కుమారుడు మోహిత్ శ్రీసత్యలను చంపాలని నిర్ణయించుకుంది.
పిల్లలిద్దరికీ ఆదివారం రాత్రి ఆహారంలో విషం కలిపి పెట్టింది. పిల్లల అమ్మమ్మ విషయం గమనించి రాజమహేంద్రవరంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకుకెళ్లగా అప్పటికే చిన్నారులిద్దరూ మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై లక్ష్మీ అనూష చెబుతున్న పొంతనలేని సమాధానాలపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com