MURDER: స్వాతి చెల్లిని కూడా వేధించిన మహేందర్ రెడ్డి

మీర్‌పేటలో ఆర్మీ మాజీ ఉద్యోగి గురుమూర్తి తన భార్యను అత్యంత క్రూరంగా చంపిన ఘటన మరువక ముందే మరో దారుణ హత్య జరిగింది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి మూసీలో పడేసిన భర్త మిస్సింగ్ నాటకమాడాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని బోడుప్పల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (25), మహేందర్ ఏడాదిన్నర క్రితం ప్రేమవివాహం చేసుకొని బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 23న సాయంత్రం పథకం ప్రకారం మహేందర్‌రెడ్డి తన భార్య స్వాతిని కొట్టి బెడ్ మీద పడేశాడు. ఆమె అపస్మాకర స్థితిలోకి వెళ్లిన తర్వాత యాక్సా బ్లేడ్‌తో తల, మొండెం, కాళ్లు, చేతులు వేరు చేశాడు. రాత్రి సమయంలో బయట పెట్రోలింగ్ ఉండటంతో ఎవరికీ అనుమానం రాకుండా చిన్న చిన్న కవర్లలో ముక్కలు తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాడు. తల ఒక సారి, కాళ్లు ఒకసారి, చేతులు ఒకసారి ఇలా మూడు సార్లు మూసీ వద్దకు వెళ్లి విసిరేశాడు. శవాన్ని మాయం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు. స్వాతి సోదరి శ్వేత మాట్లాడుతూ.. మహేందర్ రెడ్డి నన్ను కూడా వేధించాడు.. కాలేజీ కి వచ్చి నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు.. మా అక్కను హింసించి హత్య చేశాడు.. మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేసింది.
ఎన్ని నాటాకాలు ఆడాడో...
భార్య స్వాతిని హత్య చేసిన తర్వాత మహేందర్.. చాలా నాటకాలు ఆడాడు. స్వాతి చెల్లెలు మరదలు చంద్రకళకు ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదని చెప్పాడు. వీళ్లిద్దరు ఎప్పుడూ గొడవ పడుతుంటారనే అనుమానంతో అసలు ఏం జరిగిందో చూడాలని చంద్రకళ ఈవిషయాన్ని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న తన మేనమామ గోవర్ధన్‌రెడ్డికి చెప్పింది. మహేందర్‌రెడ్డికి ఇంటికి ఆయన వెళ్లగా అతనికి కూడా తన భార్య స్వాతి కనిపించడం లేదని చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి శనివారం రాత్రి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకునే క్రమంలో మేడిపల్లి పోలీసులు మహేందర్‌రెడ్డిని పలు మార్లు ప్రశ్నించడంతో .. భార్య స్వాతిని చంపింది తానేని నేరం అంగీకరించాడు.
కులాంతర వివాహంతో మనస్పర్థలు..
ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. మహేందర్‌రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లి చూసే సరికి కేవలం మొండెం మాత్రమే మిగిలింది. మొండేనికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడని, కేసుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలన్నీ పకడ్బందీగా సేకరించిన తర్వాత ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని డీసీపీ తెలిపారు. ‘‘స్వాతి, మహేందర్‌రెడ్డికి ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన రెండు నెలల నుంచే వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంటర్ చదివిన మహేందర్‌రెడ్డి ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్వాతి కాల్ సెంటర్లో జాబ్ చేస్తోంది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో నిందితుడు మహేందర్‌రెడ్డి ఒక్కడేనని తేలింది. స్వాతి హత్య క్షణికావేశంలో జరిగింది కాదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com