MURDER: పట్టపగలే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

MURDER: పట్టపగలే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య
X
మరో ఘటనలో రెండేళ్ల కూతుర్ని చంపిన కసాయి తల్లి

మే­డ్చ­ల్ మల్కా­జి­గి­రి జి­ల్లా కు­షా­యి­గూడ పో­లీ­స్ స్టే­ష­న్ పరి­ధి­లో దా­రుణ హత్య తీ­వ్ర కల­క­లం రే­పిం­ది. ప్ర­ముఖ రి­య­ల్ ఎస్టే­ట్ వ్యా­పా­రి శ్రీ­కాం­త్ రె­డ్డి­ని కొం­ద­రు గు­ర్తు­తె­లి­య­ని దుం­డ­గు­లు అత్యంత కి­రా­త­కం­గా హత్య చే­శా­రు. వేట కొ­డ­వ­ళ్ల­తో శ్రీ­కాం­త్ రె­డ్డి ఇంటి బయటే నరి­కి చం­పా­రు. అనం­త­రం అక్క­డి నుం­చి పరా­ర్ అయ్యా­రు. స్థా­ని­కుల సమా­చా­రం­తో వి­ష­యం తె­లు­సు­కు­న్న కు­షా­యి­గూడ పో­లీ­సు­లు హు­టా­హు­టిన స్పా­ట్‌­కు వచ్చా­రు. అనం­త­రం కేసు నమో­దు చే­సు­కు­ని దర్యా­ప్తు ప్రా­రం­భిం­చా­రు. అయి­తే కా­ల­నీ వా­సు­లం­తా చూ­స్తుం­డ­గా­నే శ్రీ­కాం­త్ రె­డ్డి­ని హత్య చే­సి­న­ట్లు పో­లీ­సు­లు ప్రా­థ­మిక ని­ర్ధా­ర­ణ­కు వచ్చా­రు. కొం­ద­రు అడ్డు­ప­డ­గా వా­రి­ని కత్తు­ల­తో బె­ది­రిం­పు­ల­కు గు­రి­చే­శా­రు.

రెండేళ్ల కూతుర్ని చంపిన కసాయి తల్లి

మె­ద­క్ జి­ల్లా­లో­ని శి­వ్వం­పేట మం­డ­లం­లో­ని శభా­ష్ పల్లి­లో దా­రు­ణం చోటు చే­సు­కుం­ది. వి­వా­హే­తర సం­బం­ధా­ని­కి అడ్డు­గా ఉం­ద­ని రెం­డే­ళ్ల కూ­తు­రి­ని కసా­యి తల్లి, ప్రి­యు­డు హత్య చే­శా­రు. మమ­త­కు ఐదే­ళ్ల క్రి­తం సి­ద్ది­పేట జి­ల్లా రా­య­పో­ల్ గ్రా­మా­ని­కి చెం­దిన భా­స్క­ర్ తో పె­ళ్లైం­ది. ఇద్ద­రు పి­ల్ల­లు కూడా ఉన్నా­రు. ఈ ఏడా­ది మా­ర్చి­లో భర్త­తో గొడవ పె­ట్టు­కు­ని ఇద్ద­రు పి­ల­ల్ల­తో కలి­సి పు­ట్టిం­టి­కి వచ్చిన మమత.. అదే గ్రా­మా­ని­కి చెం­దిన ఫయా­జ్ తో వి­వా­హే­తర సం­బం­ధం పె­ట్టు­కుం­ది. తమ వి­వా­హే­తర సం­బం­ధా­ని­కి అడ్డు­గా ఉం­ద­ని చి­న్నా­రీ తను శ్రీ­ని తల్లి మమత, ప్రి­యు­డు ఫయా­జ్ హత్య చే­శా­రు. కసా­యి తల్లి మమ­త­తో పాటు ప్రి­యు­డు ఫయా­జ్ ను పో­లీ­సు­లు అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు.

Tags

Next Story