MURDER: ప్రియుడిని చంపి.. నెయ్యి, వైన్ పోసి తగలెట్టేసింది

MURDER: ప్రియుడిని చంపి.. నెయ్యి, వైన్ పోసి తగలెట్టేసింది
X
ఢిల్లీలో సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థి హత్య... దారుణంగా హత్య చేసిన ప్రియురాలు...శవంపై నూనె,నెయ్యి, వైన్ చల్లి గ్యాస్ లీక్

ఈ నెల మొ­ద­టి వా­రం­లో దేశ రా­జ­ధా­ని ఢి­ల్లీ­లో సి­వి­ల్ సర్వీ­సె­స్ కోసం సి­ద్ధ­మ­వు­తో­న్న యు­వ­కు­డు అను­మా­నా­స్పద మృతి కేసు దర్యా­ప్తు­లో వి­సు­పొ­యే వా­స్త­వా­లు బయ­ట­ప­డ్డా­యి. దీని వె­నుక భయా­నక కు­ట్ర­ను పో­లీ­సు­లు వె­లి­కి­తీ­శా­రు. అత­డి­తో సహ­జీ­వ­నం చే­స్తో­న్న యు­వ­తి.. తన మాజీ ప్రి­యు­డి­తో కలి­సి అత్యంత దా­రు­ణం­గా హత్య­చే­సి, ప్ర­మా­దం­గా చి­త్రీ­క­రిం­చే ప్ర­య­త్నం చే­సిం­ది. తన వ్య­క్తి­గత వీ­డి­యో­ల­ను డి­లీ­ట్ చే­య­డా­ని­కి ని­రా­క­రిం­చ­డం­తో మాజీ ప్రి­యు­డి సాయం తీ­సు­కు­ని ఘా­తు­కా­ని­కి పా­ల్ప­డిం­ది. ఆమె, మాజీ ప్రి­యు­డు, వారి స్నే­హి­తు­డు కలి­సి గొం­తు ను­లి­మి చం­పే­సి, నె­య్యి, వైన్ పోసి శవా­న్ని తగు­ల­బె­ట్టా­రు. అతడు అగ్ని­ప్ర­మా­దం­లో చని­పో­యి­న­ట్లు చి­త్రీ­క­రిం­చేం­దు­కు మృ­త­దే­హం­పై నె­య్యి, నూనె, వై­న్‌ చల్లి.. సి­లిం­డ­ర్‌ నుం­చి గ్యా­స్‌ లీ­క్‌ చేసి పే­లు­డు జరి­గే­లా చే­సి­న­ట్లు వె­ల్ల­డైం­ది. ఈనెల 6న తి­మా­ర్‌­పు­ర్‌­లో­ని ఓ భవ­నం­లో పే­లు­డు సం­భ­విం­చిం­ది. అక్క­డి ఓ ఫ్లా­ట్‌­లో కా­లి­పో­యిన మృ­త­దే­హం కని­పిం­చిం­ది. మృ­తు­డి­ని రా­మ్‌­కే­శ్‌ మీనా(32)గా గు­ర్తిం­చా­రు. పే­లు­డు­కు ముం­దు ఇద్ద­రు వ్య­క్తు­లు ము­ఖా­ల­కు ము­సు­గు­లు ధరిం­చి భవనం లో­ప­ల­కు వె­ళ్లి­న­ట్లు సీ­సీ­టీ­వీ దృ­శ్యా­ల్లో కని­పిం­చిం­ది. కా­సే­ప­టి తర్వాత వా­రి­తో పాటు ఓ యు­వ­తి కూడా బయ­ట­కొ­చ్చిం­ది. వీరు వె­ళ్లి­పో­యిన కా­సే­ప­టి­కే భవ­నం­లో పే­లు­డు జరి­గిం­ది. ఆ యు­వ­తి­ని ఫో­రె­న్సి­క్‌ సై­న్సె­స్‌ వి­ద్యా­ర్థి­ని అమృ­తా చౌ­హా­న్‌(21)గా గు­ర్తిం­చా­రు.

అమృత ప్రై­వే­టు వీ­డి­యో­ల­ను రా­మ్‌­కే­శ్‌ రి­కా­ర్డు చే­శా­డ­ని, వా­టి­ని డి­లీ­ట్‌ చే­సేం­దు­కు అం­గీ­క­రిం­చ­క­పో­వ­డం­తో అమృత తన మాజీ ప్రి­యు­డు, మరో స్నే­హి­తు­డి­తో కలసి అత­డి­ని హత్య చే­సి­న­ట్లు పో­లీ­సు­లు తె­లి­పా­రు. నిం­ది­తు­ల­ను అరె­స్టు చే­సి­న­ట్లు చె­ప్పా­రు. ఈ ఘట­న­పై మీనా కు­టుం­బ­స­భ్యు­లు అను­మా­నా­లు వ్య­క్తం చే­య­డం­తో పో­లీ­సు­లు కేసు నమో­దు చేసి దర్యా­ప్తు చే­ప­ట్టా­రు. ప్ర­మా­దం జరి­గిన బి­ల్డిం­గ్ వద్ద సీ­సీ­టీ­వీ ఫు­టే­జీ­ని పరి­శీ­లిం­చ­డం­తో ముం­దు రోజు రా­త్రి ము­ఖా­ల­ను మా­స్క్‌­లు ధరిం­చిన ఇద్ద­రు అక్క­డ­కు రాగా.. కొ­ద్ది­సే­ప­టి­కే ఒకరు బయ­ట­కు వె­ళ్లి­న­ట్లు రి­కా­ర్డ­య్యిం­ది. ఆ తర్వాత ఒక యు­వ­కు­డు, ఒక మహిళ కూడా అక్క­డి నుం­చి వె­ళ్లి­పో­యా­రు. ఆమె­ను రామ్ కేశ్ లివ్-ఇన్ పా­ర్ట్‌­న­ర్ అమృత చౌ­హా­న్‌­గా గు­ర్తిం­చా­రు. వారు వె­ళ్లిన కొ­ద్ది సే­ప­టి­కి మం­ట­లు చె­ల­రే­గి­న­ట్టు సీ­సీ­టీ­వీ ఫు­టే­జ్‌ బయ­ట­పె­ట్టిం­ది. అలా­గే, ఆ సమ­యా­ని­కి అమృత ఫోన్ రామ్ కేశ్ ఫ్లా­ట్ సమీ­పం­లో ఉన్న­ట్లు కాల్ రి­కా­ర్డు­లు ధ్రు­వీ­క­రిం­చా­యి. దాం­తో పో­లీ­సు­లు హత్య­గా అను­మా­నిం­చి లో­తైన దర్యా­ప్తు ప్రా­రం­భిం­చా­రు. ఘటన తర్వాత అమృత ఫోన్ స్విచ్చాఫ్ అయింది. ఆమె కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు అక్టోబర్ 18న పట్టుకున్నారు.

Tags

Next Story