MURDERS: ముగ్గురు యువతుల హత్య.. ఇన్ స్టాలో లైవ్ టెలికాస్ట్

MURDERS: ముగ్గురు యువతుల హత్య.. ఇన్ స్టాలో లైవ్ టెలికాస్ట్
X

అర్జెం­టీ­నా రా­జ­ధా­ని బ్యూ­న­స్ ఎయి­ర్స్ లో ము­గ్గు­రు యు­వ­తు­ల్ని చి­త్ర­హిం­స­ల­కు గు­రి­చే­సి ఓ డ్ర­గ్స్ గ్యాం­గ్ అత్యంత దా­రు­ణం­గా హత­మా­ర్చిం­ది. మో­రె­నా వె­ర్డి (20), బ్రెం­డా డెల్ కా­స్టి­ల్లో (20), లారా గు­టి­యె­ర్రె­జ్ (15) అనే ము­గ్గు­రు యు­వ­తు­లు సె­ప్టెం­బ­ర్ 19న మి­స్స­య్యా­రు. యు­వ­తు­ల్ని పా­ర్టీ పే­రు­తో మభ్య­పె­ట్టి.. తమతో తీ­సు­కె­ళ్లిన గ్యాం­గ్.. దా­రు­ణం­గా చం­పే­సిం­ది. డ్ర­గ్స్ గ్యాం­గ్ తో వా­రి­కు­న్న గొ­డ­వ­లే హత్య­కు దా­రి­తీ­సి­న­ట్లు పో­లీ­సు­లు ని­ర్థా­రిం­చా­రు. ఈ దు­శ్చ­ర్య­కు పా­ల్ప­డిన గ్యాం­గ్ లో ఒకరు తన ఇన్ స్టా ప్రై­వే­ట్ అకౌం­ట్లో లైవ్ టె­లీ­కా­స్ట్ చే­సి­న­ట్లు చె­ప్ప­డం­తో.. అం­ద­రూ ది­గ్భ్రాం­తి­కి గు­ర­య్యా­రు. గో­ళ్ల­ను పీకి.. వే­ళ్ల­ను నరి­కి, తీ­వ్రం­గా కొ­ట్టి.. ఊపి­రా­డ­కుం­డా చేసి చం­పి­న­ట్లు లైవ్ చూ­సిన 45 మంది పో­లీ­సు­ల­కు వి­వ­రిం­చి­న­ట్లు సమా­చా­రం. ఈ పా­శ­విక చర్య­కు ని­ర­స­న­గా వే­లా­ది మంది ప్ర­జ­లు వీ­ధు­ల్లో­కి వచ్చి ని­ర­స­న­లు తె­లి­పా­రు. బా­ధిత యు­వ­తుల కు­టుంబ సభ్యు­ల­తో పా­ర్ల­మెం­ట్ వరకూ భారీ ర్యా­లీ ని­ర్వ­హిం­చి.. దో­షు­ల్ని కఠి­నం­గా శి­క్షిం­చా­ల­ని డి­మాం­డ్ చే­స్తు­న్నా­రు.

Tags

Next Story