Chanchalguda Jail : ఖైదీ కడుపులో మేకులు, గంజాయి పొట్లాలు!

హైదరాబాద్:- చంచల్ గూడ జైలులోని ఓ ఖైదీ చేసిన నిర్వాకం ఇటు పోలీసులు, అటు వైద్యులను ఉరుకులు పరు గులు పెట్టించింది.
కడుపు నొప్పితో విలవిలలాడుతూ ఆస్పత్రికి వచ్చిన ఆ ఖైదీ కడుపులో నుంచి మేకులు , రబ్బరు మూతలతోపాటు, గంజాయి పొట్లాలుగా భావిస్తున్న రెండు ప్లాస్టిక్ కవర్ ప్యాకెట్లను ఉస్మానియా వైద్యులు బయటికి తీశారు.
చంచల్ గూడ జైలులో (Chanchalguda Jail ) ఖైదీగా ఉన్న మహ్మద్ సోహేల్(21) తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండ డంతో పరీక్షలు నిర్వహించిన జైలు వైద్యులు ఉస్మానియా ఆస్పత్రికి తర లించారు. సోహేల్ కు ఎక్స్ రే తీయించిన వైద్యులు అతని కడుపులో రెండు మేకులు ఉన్నట్టు గుర్తించారు,సోహేల్ రెండ్రోజుల క్రితం ఆ మేకులు మింగినట్టు తెలిసింది మంగళవారం ఎండోస్కోపీ ద్వారా సోహేల్ కడుపులోని మేకులను వైద్యు లు బయటికి తీశారు.
అనం తరం మరోసారి పరీక్షించగా సోహేల్ కడుపులో రెండు రబ్బరు మాతలు , రెండు ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు వాటిని కూడా ఎండో స్కోపి ద్వారా బయటకి తీసేశారు.
సోహేల్ కడుపులో నుంచి తీసిస ప్యాకెట్లలో గంజాయి ఉందన్న అనుమానంతో వాటిని పరీక్షలకు పంపించారు.
శస్త్రచికిత్స చేయకుండా రోగి ప్రాణాలను కాపాడిన గ్యాస్టో ఎంట్రాలజీ విభాగం హెచ్వోడీ డాక్టర్ బి. రమేశ్ బృందాన్ని ఉస్మా నియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అభినందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com