Narsingi Drugs Case : నార్సింగి డ్రగ్స్ కేసులో బడా బాబులు
నార్సింగి డ్రగ్స్ కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో మరికొందరు సెలబ్రిటీలు ఉన్నట్లు గుర్తించారు. వాళ్లందరికీ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని భావిస్తున్నారు. ఈ నెల 15న యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, ఎస్ వోటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి రాజేంద్రనగర్ పరిధి హైదర్ షాకోట్ లోని ఓ అపార్ట్ మెంట్ పై దాడులు చేశారు. డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నైజీరియన్లు సహా ఐదుగురు సప్లయర్లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ సైతం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ గ్యాంగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన పెడ్లర్లు, కస్టమర్లు సహా 20 మందిని నిందితులుగా చేర్చారు. ఈ డ్రగ్స్ నెట్ వర్క్ లో నైజీరియన్‌కు చెందిన ఎబుకా సుజీని కింగ్ పిన్ గా గుర్తించారు. ఆనౌహా బ్లెస్సింగ్ అనే నైజీరియన్ మహిళ ద్వారా నైజీరియా నుంచి ఢిల్లీ, హైదరాబాద్, ఏపీ సహా ఇతర ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 19 మంది ప్రముఖులకు పోలీసులు నోటీసులు పంపించారు. తాజాగా.. నిందితులు మరో 30 మంది సెలబ్రిటీల పేర్లను వెల్లడించారు. ఇందులో ప్రముఖ కంపెనీల ఓనర్లు సైతం ఉన్నట్లు సమాచారం. ఈ 30 మందికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com