Nellore police : నెల్లూరు జిల్లాలో అరాచకం.. నడిరోడ్డుపై మహిళ చీర లాగేసిన పోలీసులు

Nellore police : నెల్లూరు జిల్లాలో అరాచకం.. నడిరోడ్డుపై మహిళ చీర లాగేసిన పోలీసులు
Nellore police : నెల్లూరు జిల్లాలో పోలీసులు అరాచకానికి పాల్పడ్డారు. నడిరోడ్డుపై మహిళ చీరను లాగేశారు.

Nellore police : నెల్లూరు జిల్లాలో పోలీసులు అరాచకానికి పాల్పడ్డారు. నడిరోడ్డుపై మహిళ చీరను లాగేశారు. ఈ దాష్టికం కలిగిరి మండలం పెద్దఅన్నలూరులో జరిగింది. స్థానిక వైసీపీనేత సిద్ధారెడ్డి వీరారెడ్డి.. అక్రమ లే అవుట్‌కి గ్రామకంఠం భూమిలో రోడ్డువేశారు. దీన్ని అడ్డుకోవడానికి గ్రామస్థులు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు గ్రామస్థులపై దారుణంగా ప్రవర్తించారు. మహిళ అనికూడా చూడకుండా చీర లాగేశారు. స్థానిక సీఐ సాంబశివరావు తుపాకి చూపిస్తూ గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేశారు. గ్రామస్థులు ఎంత వేడుకుంటున్నా అధికారులు కనీసం కనికరించలేదు. అటు కేసు కోర్టులో ఉన్నప్పటికీ వైసీపీ నేతలకే పోలీసులు మద్దతు తెలపడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story