ఖమ్మం జిల్లా భార్య హత్య కేసులో న్యూ ట్విస్ట్.. మరో యువతి మృతి

ఖమ్మం జిల్లా భార్య హత్య కేసులో న్యూ ట్విస్ట్.. మరో యువతి మృతి
ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మరో యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

కట్టుకున్న వాడే నవ వధువును కాటేశాడు. నూరేళ్లు తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన వాడే.. ఆమె పాలిట యమపాశం అయ్యాడు. స్వయానా బావ వరుసైన వాడే జాలి లేకుండా చంపేశాడు. పెళ్లై మూడు నెలలు కాకుండానే.. దారుణానికి ఒడిగట్టాడు. ఖమ్మం జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనలో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పెళ్లయిన రెండు నెలలకే భార్యను హత్య చేసిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం కు చెందిన ఎర్రమల నవ్యారెడ్డికి తన సొంత బావ నాగశేషురెడ్డి గతేడాది డిసెంబర్ లో వివాహం జరిగింది. తన భార్య కనబడడం లేదంటూ రెండు రోజుల క్రితం భర్త పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుప్పెనకుంట్ల గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ నెల 2న మృతురాలు భర్త నాగేశేషురెడ్డితో కలిసి బైక్ పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

విచారణలో భాగంగా భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. బుధవారం రాత్రి సమయంలో భార్యకు నిద్రమాతలు ఇచ్చి కుక్కలగుట్ట శివారులోని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లినట్లు తెలిపాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే చున్నీ చెట్టుకు ఉరివేసినట్లు వెల్లడించాడు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతురాలి సెల్ ఫోన్ నుండి ఆమె తండ్రికి మెసేజ్ పంపించాడు. ఇంనీరింగ్ బ్యాక్ లాగ్ లు ఉన్నాయని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ లో తెలిపాడు.

అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తొండల గోపారం-పగిళ్లపాడు గ్రామాల మధ్యలో వెనీలా అనే యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఎర్రుపాలెం మండలం పగిళ్లపాడుకు చెందిన యువతిగా గుర్తించారు. దీంతో నవ్యారెడ్డి హత్యకు యువతి ఆత్మహత్యకు సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు కుటుంబసభ్యులు. ఈ నేపథ్యంలో పోలీసులు వివాహేతర సంబంధం కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story