TG : జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి

TG : జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి
X

నియోజకవర్గ కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో నవజాత మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన బోయ చెన్నకేశవులు భార్య బోయ కీర్తి పురిటినొప్పులతో ఉదయం 8: 30 ప్రాంతంలో ఆసుపత్రికి వచ్చింది. సాయంత్రం 4:30 గంటల సమయంలో సాధారణ కాన్పు తో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, సాయంత్రం వరకు వైద్య సిబ్బంది ఎటువంటి చికిత్స నిర్వహించలేదని, ఈ క్రమంలో బిడ్డ కడుపులో ఉమ్మనీరు మింగిందని వైద్యుల సలహా మేరకు మహబూబ్ నగర్ కు తరలించేందకు ప్రయత్నించారు. అయితే బాబు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన బాబు మృతి చెందాడని కీర్తి భర్త చెన్నకేశవులు, బంధువులు ఆసుపత్రి ఆందోళనకు దిగారు. దీంతో జడ్చర్ల ఎస్ఐ శివానంద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని కీర్తి కుటుంబ సభ్యులను సముదాయించారు. బాధితుల నుంచి వైద్య సిబ్బందిపై ఫిర్యాదు తీసుకుని కేసు దాదాపు చేస్తున్నట్లు తెలిపారు.

Tags

Next Story