Tamil Nadu : పెళ్లైన నాలుగోరోజే నవవధువు సూసైడ్

Tamil Nadu : పెళ్లైన నాలుగోరోజే నవవధువు సూసైడ్
X

పెళ్లైన నాలుగోరోజే నవవధువు సూసైడ్ చేసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తులం బంగారం కోసం భర్త, అత్తమామలు వేధించారు. దీంతో పుట్టింట్లోనే కొత్త పెళ్లికూతురు తనువు చాలించింది. జూన్ 27న పన్నీర్‌తో లోకేశ్వరి వివాహం జరగగా కట్నంగా 5 తులాల బంగారం ఒప్పుకుని 4తులాల బంగారం ఇచ్చారు. మరో తులం కోసం లోకేశ్వరిని వేధించారు. కాపురానికి వెళ్లినరోజు నుంచే లోకేశ్వరికి వేధింపులు మొదలయ్యాయి. బంగారం, బైక్, ఏసీ తీసుకురావాలంటూ అత్తింటి నుంచి లోకేశ్వరికి చిత్రహింసలు ఎక్కువకావడంతో జూన్ 30న పుట్టింటికి వెళ్లి లోకేశ్వరి వాష్‌రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తండ్రి గజేంద్రన్ పొన్నేరి పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భర్తను అరెస్టు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అయితే వరుడి కుటుంబం ఈ ఆరోపణలను ఖండించింది, ఎటువంటి కట్నం డిమాండ్ చేయలేదని పేర్కొన్నారు. తిరుప్పూర్‌లో ఇలాంటి వరకట్న ఆత్మహత్య జరిగిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది. 27 ఏళ్ల రిధన్య అనే మహిళ తన భర్త, అత్తమామలు వరకట్నం కోసం హింసించారని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story