NIA : మూడు రాష్ట్రాలలో ఉగ్రవాదుల కోసం వేట

NIA  : మూడు రాష్ట్రాలలో ఉగ్రవాదుల కోసం వేట
కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో సోదాలు జరుగుతున్నాయి

ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులను గుర్తించేందుకు మూడు రాష్ట్రాలను జల్లెడ పడుతోంది NIA (National Investigation Agency). కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో సోదాలు జరుగుతున్నాయి. కేరళ, తమిళనాడులో 60కిపైగా ప్రదేశాలలో ఉగ్రవాద సంస్ధ IS (ఇస్లామిక్ స్టేట్) యొక్క సానుభూతిపరులు ఉన్నట్లు గుర్తించారు. వారి ఇళ్లపై సోదాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం అక్టోబర్ లో కోయంబత్తూర్ కారు సిలిండర్ పేలుడుతో పాటు నవంబర్ 19లో కర్ణాటకలోని మంగళూరులో కూడా పేలుడు జరిగింది. వీటి వెనకాల ఉగ్రవాద సంస్థల హస్తం ఉన్నట్లు NIA తెలిపింది.

అక్టోబర్ 23, 2022న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన జమేషా ముబీన్ అనే టెర్రరిస్ట్ ఓ శివాలయం వద్ద, కారులో ఉండగా గ్యాస్ సిలిండర్ పేలి హతమయ్యాడు. ఇతను ఐఎస్ఐఎస్ కి చెందిన టెర్రరిస్ట్ గా గుర్తించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడి శివాలయం దగ్గర పెద్ద ఎత్తున నష్టం కలించేందుకు ప్లాస్ చేసినట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. అతని ఇంట్లో సోదాలు జరుపగా 75కిలోల పేలుడు పదార్థాలు, కీలక పత్రాలను, ఐసిస్ జెండాను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పై నిఘా పెట్టిన ఎన్ఐఏ.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు సానుభూతిపరులు ఉన్నట్లు గుర్తించింది. నవంబర్ 19న కర్ణాటకలోని మంగళూరులో కూడా బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో భాగంగానే బుధవారం మెరుపు దాడులను చేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story