Vizianagaram: ఏపీలో మరో దారుణం.. విజయనగరంలో మహిళపై అత్యాచారం..

X
Vizianagaram: ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. రోజూ ఏదోఒక చోట అత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుంటూరు జిల్లాలో వరుస ఘటనలు మరువకముందే.. విజయనగరంలో మరో దారుణం జరిగింది. ఉడా కాలనీలో 25 ఏళ్ల మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తి అర్థరాత్రి వచ్చి తలుపు కొడితే తీశానని.. అనంతరం అత్యాచారం చేశాడని దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మహిళ.. భర్తతో విడిపోయి తన ఇద్దరు పిల్లలుతో కలిసి విజయనగరంలో ఉంటుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
