Eluru: ఏలూరులో అధికార పార్టీ దాష్టీకానికి మరో దళితుడు బలి..

Eluru: ఏలూరులో అధికార పార్టీ దాష్టీకానికి మరో దళితుడు బలి..
Eluru: ఏపీలో మరో దళితుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఏలూరు శనివారపుపేటకు చెందిన కూకటి సోమరాజు మృతిచెందాడు.

Eluru: ఏపీలో మరో దళితుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఏలూరు శనివారపుపేటకు చెందిన కూకటి సోమరాజు మృతిచెందాడు. ఈ మృతికి కారణం వైసీపీ నేత అయిన రెడ్‌క్రాస్ ఛైర్మన్‌ బి.వి.కృష్ణారెడ్డి అంటూ ఏలూరులో అతని ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన చేస్తున్నారు. తన భర్త మృతికి బి.వి.కృష్ణారెడ్డి, ఏఎస్పీ సరిత కారణమంటూ భార్య ప్రేమలత ఆరోపించారు.

ఇంటి వద్ద పిల్లల ఆటలో గొడవ జరిగితే.. రెడ్‌క్రాస్ ఛైర్మన్‌ బి.వి.కృష్ణారెడ్డి, ఏఎస్పీ సరిత జోక్యం చేసుకున్నారని, తన భర్త సోమరాజును వేధించారని ఆరోపించారు. పోలీసులు అక్రమంగా కేసు పెట్టి వేధించడం వల్లే తన భర్త మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు మృతుడి భార్య ప్రేమలత.

ఈనెల 8న మృతుడి కుమారుడు శ్యామ్.. స్నేహితులతో కలిసి ఇంద్ర కాలనీలో క్రికెట్ ఆడుతుండగా.. శ్యామ్‌కు, పేనుపోతుల సాయికి మధ్య వివాదం జరిగింది. అది కొట్టుకునే వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న శ్యామ్‌ తండ్రి సోమరాజు.. ఇద్దరినీ మందలించి చెరొక దెబ్బ వేసి పంపేశాడు. అయితే, దెబ్బలు తిన్న సాయి.. తన స్నేహితులు జి.కిరణ్, మహేష్, అభిరామ్‌ను తీసుకొచ్చి శ్యామ్‌ను వికెట్లతో కొట్టి, కులం పేరుతో దూషించారని ప్రేమలత చెబుతున్నారు.

ఎస్సీ కులానికి చెందిన వాళ్లు, ఇకపై తమలాంటి వారితో కలిసి ఆడుకోవద్దంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లారని చెప్పుకొచ్చారు. ఆ మరుసటి రోజు ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చి.. తన భర్తపై సెక్షన్ 341, 324, 323, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారంటూ చెప్పారని ప్రేమలత వెల్లడించారు. పిల్లల మధ్య జరిగిన గొడవను కేసుల వరకు తీసుకెళ్లడం దేనికి అంటూ సాయి ఇంటికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయమని, అయితే.. తన కుమారుడు వైసీపీ నేత B.V.కృష్ణారెడ్డి దగ్గర పని చేస్తున్నాడని, ఈ విషయం ASP సరిత చూసుకుంటుందని చెప్పి పంపించారని ప్రేమలత చెప్పుకొచ్చారు.

ఆ రోజు నుంచి తన భర్త, కుమారుడు శ్యామ్‌ రోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ASP సరిత, B.V. కృష్ణారెడ్డి పెట్టిన మానసిక ఒత్తిళ్ల వల్ల తన భర్త ఆరోగ్యం చెడిపోయిందని ప్రేమలత చెప్పుకొచ్చారు. అప్పటికే, ఆస్పత్రుల చుట్టూ తిరిగినా కాపాడుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పేనుపోతుల సాయి, APS సరిత, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు B.V. కృష్ణారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, దళితులమైన తమకు తగిన న్యాయం చేయాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story