Operation Myanmar : హైదరాబాద్లో ఆపరేషన్ మయన్మార్

Operation Myanmar : హైదరాబాద్లో ఆపరేషన్ మయన్మార్
X

హైదరాబాద్ నగరంలో చొరుబాటు దారులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు మయన్మార్ దేశానికి చెందిన మరో నలుగురిని అరెస్టు చేశారు. మయన్మార్ దేశం నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన ఈ నలుగురు తప్పుడు పత్రాలను సమర్పించి భారత దేశ ఆధార్ కార్డు, గ్యాస్ బుక్, పాన్ కార్డులను పొందినట్లు గుర్తించారు. మదర్సాలో పని చేసే టీచర్లు ఈ పత్రాల తయారీ భాగోతంలో కీలకంగా పని చేశారని పోలీసులు విచారణలో తేలింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మయన్మార్ దేశానికి చెందిన మహ్మద్ అమీన్, అతని భార్య మహ్మద్ రుమానా అక్తర్, వీరి కుమారుడు మహ్మద్ నయిమ్ లు 2011 సంవత్సరంలో భారత్లోకి అక్రమంగా చొరబడ్డారు. అనంతరం 2014లో హైదరాబాద్ కు చేరుకుని పెద్ద అంబర్ పేట్ ప్రాంతంలో నివాసం ఉంటూ ఓ బ్యాటరీ షాప ఎను నడిపిస్తున్న మహ్మద్ అమీన్ మదర్సాలో టీచర్ గా పని చేశాడు. కాగా మహ్మద్ హారీస్, అయాజ్ తో కలిసి మంచాల గ్రామంలోని మీ సేవా ద్వారా ఆధార్ కార్డు తీసుకుని, ఆపై నకిలీ మ్యారేజీ సర్టిఫికేట్ పొందాడు. వీరికి బాలాపూర్లో స్థిరపడ్డ షోయబ్ మాలిక్ నకిలీ పత్రాలతో ఆధార్ కార్డును ఇప్పించాడని గుర్తించిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆధార్, ప్యాన్ కార్డులు, గ్యాస్ బుక్ లు, బ్యాంక్ ఖాతాలు, పాసుబుక్ లు ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహాకరించిన అయాజ్, షోయబ్ మాలిక్లు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Tags

Next Story