Student : స్టూడెంట్స్‌తో టీచర్ అసభ్య ప్రవర్తన.. చితకబాదిన పేరెంట్స్

Student : స్టూడెంట్స్‌తో టీచర్ అసభ్య ప్రవర్తన.. చితకబాదిన పేరెంట్స్
X

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక ఉపాధ్యాయుడికి స్టూడెంట్స్ తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానిక బ్రాహ్మణవీధిలో గల నారాయణ స్కూల్లో సోషల్ టీచర్ శ్రీనివాస్.. అమ్మాయిలను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

దీంతో వారు విషయాన్ని పేరెంట్స్ కు చెప్పారు. తల్లిదండ్రులు స్కూల్ కు వచ్చి సదరు ఉపాధ్యాయుడిని చితకబాదారు. దీంతో అక్కడ కలకలం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

Tags

Next Story