Crime : మియాపూర్ రఫా రీహాబిలిటేషన్ సెంటర్‌లో రోగి హత్య

హైదరాబాద్ మియాపూర్ లోని రఫా రీహాబిలిటేషన్ సెంటర్ లో... సందీప్ అనే రోగిని తోటి రోగులు హత్య చేశారు. ఏపీలోని పిడుగురాళ్లకు చెందిన సందీప్ ... డ్రగ్స్ అలవాటు నుంచి బయటపడేందుకు.. 8 నెలలుగా నాగార్జున ఎంన్ క్లేవ్ లోని రఫా పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నాడు. నల్గొండకు చెందిన ఆదిల్, బార్కాస్ కు చెందిన సులేమాన్ కూడా డ్రగ్స్ కు బానిసలై.... 3 నెలలుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. బుధవారం సాయంత్రం ఈ ముగ్గురి మధ్య గొడవ జరగడంతో.. సందీప్ పై ఆదిల్ , సులేమాన్ దాడి చేసి చంపేశారు. ఏమీ తెలియనట్లు ఐదున్నర తర్వాత భవనం కింద నిర్వహించే క్లాస్ కు హాజరయ్యారు. సందీప్ రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి పైకి వెళ్లి చూశారు. రక్తగాయాలతో నిర్జీవంగా పడి ఉన్న సందీప్ ను మదీనాగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఆదిల్ , సులేమాన్ ఇద్దరూ కలిసి... సందీప్ ను చంపినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాలతోపాటు ఇతర ఆధారాలను సేకరించారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com