East Godavari: కంటైనర్‌లో 700 కేజీలు.. ఇన్నోవా కారులో 300 కేజీల గంజాయి.. మొత్తం విలువ రూ.2 కోట్లు..

X
East Godavari: తూర్పుగోదావరిజిల్లా చింతూరు ఏజెన్సీప్రాంతంలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా నుంచి కంటైనర్‌లో తరలిస్తున్న రెండుకోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో వెయ్యికిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కంటైనర్ లోని డ్రైవర్ సీటువెనుక ఏర్పాటుచేసిన క్యాబిన్‌లో 7వందల కేజీల గంజాయి లభించగా... ఇన్నోవాకారులో తరలిస్తున్న 3వందల కేజీల పట్టుకున్నారు. గంజాయిపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్దవహిస్తున్నామని, చెక్‌పోస్టులుపెట్టి తనిఖీలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఈజీ మనీకోసం అలవాటుపడ్డయువత గంజాయిని రవాణాతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
