Kidnapping Case : బుచ్చిరెడ్డి పాళెం కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

Kidnapping Case : బుచ్చిరెడ్డి పాళెం కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
X

బుచ్చిరెడ్డి పాళెం పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించారు. కిడ్నాప్ కి పాల్పడిన 10 మంది దుండగులను అదుపులోకి తీసుకొని కిడ్నాప్ కు ఉపయోగించిన మూడు కార్లు మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీఐ శ్రీనివాస రెడ్డి ముద్దాయిలను మీడియా ముందు హాజరు పరిచి కేసు వివరాలను వెల్లడించారు. ఫిర్యాదుదారుడు రమేష్ , ముద్దాయి సురేంద్రకు బెంగళూరులో ఎస్.ఎల్.వి ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ పెట్టి ధూపాలు పూజ సామాగ్రి తయారి పరిశ్రమ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే వ్యాపార లావాదేవీలలో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తేయని, దీంతో బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడుకు వెళుతున్న రమేష్ ను జిపిఎస్ ట్రాక్ ద్వారా రెండు కార్లలో అతనిని వెంబడించి కిడ్నాప్ చేశారని తెలిపారు. రొట్టెల పండుగను ముగించుకుని కొందరు గ్రామానికి వెళుతున్న యువకులు జరిగిన ఘటనపై 112 కు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆ యువకులు వారిని ప్రశ్నిస్తే ఫైనాన్స్ వారు అని జవాబు ఇచ్చారని తెలిపారు. రమేష్ అనే వ్యక్తిని మదనపల్లి దగ్గర ఉన్న నిమ్మనపల్లి గ్రామంలోని ఓ తోటలో బంధించి ఉన్నారని వారు అక్కడి నుండి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ముద్దాయిలను చాకచక్యంగా నెల్లూరు టౌన్ తల్ప గిరి కాలనీలో ఓ పాడు పడ్డ ఇంటిదగ్గరఅరెస్ట్ చేసామన్నారు. ఏ1 ముద్దాయి వేము సురేంద్రబాబు ఎర్రచందనం, హత్య కేసుల్లో దగదర్తి పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని వెల్లడించారు.

Tags

Next Story