Prabhas Fan Suicide: 'రాధే శ్యామ్'కు నెగిటివ్ టాక్ వచ్చిందంటూ ఫ్యాన్ సూసైడ్..
Prabhas Fan Suicide: నటీనటులపై ప్రేక్షకులకు ఉండే అభిమానం అసలు వెలకట్టలేనిది. ముఖ్యంగా తమ అభిమాన హీరోలను దేవుళ్లగా భావిస్తారు కొందరు ఫ్యాన్స్. అయితే అలాంటి అభిమానం ఒక్కొక్కసారి విచక్షణ కూడా కోల్పోయేలా చేస్తుంది. అందుకే ఫ్యాన్ వార్స్ లాంటివి జరుగుతుంటాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ప్రభాస్ ఫ్యాన్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. దాని కారణం చాలామందిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
ప్రభాస్ నటించిన పీరియాడిక్ లవ్ స్టోరీ 'రాధే శ్యామ్'. ఈ సినిమాను 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించింది యూవీ క్రియేషన్స్. ఇది ఒక ప్రేమకథే అయినా.. ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అంత బడ్జెట్‌ను పెట్టడానికి వెనకాడలేదు నిర్మాతలు. 'రాధే శ్యామ్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ లభిస్తోంది. అయితే అది భరించని ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు.
మిగతా హీరోల అభిమానులకంటే ప్రభాస్ అభిమానులకు ఓపిక ఎక్కువ అని అందరూ ఆటపట్టిస్తుంటారు. అయితే 'రాధే శ్యామ్' మూవీ షూటింగ్ మొదలయినప్పటి నుండి పెద్దగా అప్డేట్స్ బయటికి రాకపోవడంతో ఓ అభిమాని అప్డేట్స్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకొని నోట్‌లో యూవీ క్రియేషన్స్ పేరు రాసేస్తా అని చెప్పడం చాలామందికి గుర్తుండే ఉంటుంది. కానీ కర్నూలు జిల్లాలోని ఓ అభిమాని నిజంగానే రాధే శ్యామ్ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్నూలులోని తిలక్ నగర్‌కు చెందిన 24 ఏళ్ల రవితేజ.. ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్. అయితే తాను, తన స్నేహితులను తీసుకొని రాధే శ్యామ్ ఫస్ట్ డే కు వెళ్లాడు. సినిమా అయిపోయిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరూ మూవీ బాలేదంటూ ఆటపట్టించారు. ఇదే విషయాన్ని ఇంటికి వచ్చి తల్లికి చెప్పుకొని బాధపడ్డాడు రవితేజ.
ఆ తరువాత తల్లి ఇంట్లో లేని సమయం చూసి రవితేజ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చాలాకాలం క్రితం భర్తను కోల్పోయిన రవితేజ తల్లి.. ఇప్పుడు కొడుకును కూడా కోల్పోయింది. అయితే రాధే శ్యామ్ సినిమా బాలేకపోవడం వల్లే రవితేజ ఆత్మహత్య చేసుకున్నట్టు తన తల్లి పోలీసులకు తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com