Warangal : వరంగల్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

X
By - Manikanta |18 March 2025 4:00 PM IST
తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలో మైనర్ బాలికలను వ్యభిచారం కూపంలోకి దింపుతున్న ముఠా గుట్టు రట్టైంది. కీలక సూత్రధారి ముస్కు లతతో పాటు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో కీలక నిందితురాలు లత, నవ్యతో పాటు అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్ లను అదుపులోకి తీసుకుని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మైనర్లతో వ్యభిచారం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటు ఓ యువతి ఏర్పాటు చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ సహాయంతో మైనర్ బాలికను ట్రాప్ చేసేది. తన లవర్ తో కలిసి మైనర్ బాలికకు మద్యం, గంజాయి అలవాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆపై నర్సంపేట తీసుకెళ్ళి ముఠా సభ్యులు అత్యాచారం చేసినట్లు వెల్లడించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com