Psycho Mintu: 50కు పైగా అమ్మాయిలను అత్యాచారం, హత్య.. ఇదే సైకో సీరియల్ కిల్లర్ మింటూ హాబీ..

Psycho Mintu: ఒకే ఒక్కడు.. 50 మందికి పైగా అమ్మాయిలను ట్రాప్ చేశాడు. వీరిలో కొందరిపై అత్యాచారం చేసి కిరాతంగా హత్యచేశాడు. ఏడేళ్లుగా అరాచకాలు సాగిస్తున్న సైకో కిల్లర్ మింటూను రాజస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలతో స్నేహం చేసి, తర్వాత వారిని అంతమొందించడం హాబీగా పెట్టుకున్నాడు మింటూ అలియాస్ విక్రమ్.
అత్యాచారాలు, హత్యలతో దాదాపు ఐదు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసిరాడు. రెండు నెలల క్రితం కూడా జైపూర్‌లో సహజీవనం చేస్తున్న తన ప్రియురాలిని హత్య చేసి పరారయ్యాడు. రెండు నెలల పాటు వెతికిన జైపూర్ పోలీసులు సైకో కిల్లర్‌ను పట్టుకున్నారు. ఈ విచారణలోనే సంచలన విషయాలు బయటపడ్డాయి. అమ్మాయిలను ట్రాప్ చేయడం కోసం ఆర్మీ అధికారినంటూ చెప్పుకుంటాడు.
ఆర్మీ దుస్తుల్లోనే తిరుగుతుంటాడు. కొన్నిసార్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌నని చెప్పుకుంటూ అమ్మాయిలకు వల వేశాడు. మింటూకు అమ్మాయిలతో స్నేహం చేయడం ఇష్టం. ముందు ప్రేమిస్తున్నట్టు నటించి, లోబరుచుకుంటాడు. ఒప్పుకోకపోతే అత్యాచారం చేసి చంపేసి, ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తాడు. ఇలా తన స్నేహితురాళ్లను, బాలికలను చంపేశాడు. గతేడాది ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పూజ శర్మపై అత్యాచారం చేసి చంపేశాడు.
2019లో అల్వార్‌లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి మహువాను దౌసాకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి తప్పించుకున్నాడు. పోలీసులకు చిక్కుకుండా ఉండేందుకు ఏకంగా రాష్ట్రాలనే మారుస్తుంటాడు. కేవలం కొత్త గర్ల్‌ఫ్రెండ్స్ కోసమే వివిధ నగరాల్లో ఉద్యోగాలు చేసేవాడు. చండీగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ముంబైలో ఉద్యోగాలు చేశాడు.నిందితుడు మింటూ.. సైకో అని, సెక్స్ అడిక్ట్ అని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో సైకాలజిస్ట్ సహాయం తీసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com