Pushpa-2 : వివాదంలో 'పుష్ప-2'.. నిర్మాతలకు బెదిరింపులు!

Pushpa-2 : వివాదంలో పుష్ప-2.. నిర్మాతలకు బెదిరింపులు!
X

పుష్ప-2లో షెకావత్ పేరుతో ఉన్న క్యారెక్టర్ ను నెగటివ్ గా చూపించి తమ కమ్యూనిటీని అవమానించారని క్షత్రియ కర్ణి సేన లీడర్ రాజ్ షెకావత్ ఆగ్రహించారు. 'కర్ణి సైనికుల్లారా సిద్ధంగా ఉండండి. ఈ సినిమా నిర్మాతలపై దాడి చేద్దాం అని ఆయన సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఓ వీడియో వైరలవుతోంది. సినిమా వాళ్లు క్షత్రియులను చాలా కాలంగా అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు. షెకావత్ పదాన్ని సినిమాలో నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు. కాగా పుష్ప-2లో ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్‌గా నటించారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప2 మూవీ డిసెంబర్ 5 వ తేదీన విడుదలై కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 875 కోట్లకు పైగా వసూళ్లను సాధించి దూసుకుపోతుంది.

Tags

Next Story