Rachakonda : ఏటీఎం చోరీ కేసు ఛేదించిన రాచకొండ పోలీసులు

Rachakonda : ఏటీఎం చోరీ కేసు ఛేదించిన రాచకొండ పోలీసులు
X

హైదరాబాద్ శివారులో జరిగిన ఏటీఎం చోరీ కేసులను రాచకొండ పోలీసులు చేధించారు. మూడు నిమిషాల్లో ఏటీఎంలోని 29 లక్షలు కాజేసిన కేసును చేధించేందుకు చాలా కష్టపడ్డామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెళ్లడించారు. విచారణలో నిందితులు చెప్పిన విషయాలు తమను కంగు తినిపించాయన్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఫ్లైట్‌లో హైదరాబాద్‌ చేరుకున్న ముఠా నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఏటీఎంలను టార్గెట్ చేసి రెక్కీ నిర్వహించారు. రాజస్థాన్, హర్యానాకు చెందిన అంతర్ రాష్ట్ర పాత నేరస్తులు ఈనెల రెండున రావిర్యాలలో జరిగిన ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. నిందితుల్లో ఐదుగురు నిందితులను ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేయగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు రాచకొండ సిపి సుదీర్ బాబు వెల్లడించారు.

Tags

Next Story