CM Revanth : రాజలింగమూర్తి హత్య.. సీఎం రేవంత్ ఆరా !

CM Revanth : రాజలింగమూర్తి హత్య.. సీఎం రేవంత్ ఆరా !
X

భూపాలపల్లిలో నడిరోడ్డుపై రాజలింగమూర్తి హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడు మేడి‌గడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు బీఆర్ఎస్ కారణమని కేసు వేసిన సంగతి తెలిసిందే. కాగా భూవివాదమే హత్యకు కారణమని సమాచారం.

మరోవైపు రాజలింగమూర్తి హత్యను బీఆర్ఎస్ కు అంటగట్టేందుకు యత్నిస్తున్నారని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ‘నాతో పాటు కేసీఆర్, హరీశ్ రావుపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను చంపించానని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. ఏ ఆధారంతో ఈ ఆరోపణలు చేస్తున్నారు? బీఆర్ఎస్ హత్యారాజకీయాలను ప్రోత్సహించదు. కాళేశ్వరం కేసును చట్టపరంగానే ఎదుర్కొంటాం’ అని తెలిపారు.

Tags

Next Story