POCSO Case : మైనర్ బాలికపై రేప్ అటెంప్ట్ కేసు.. పోక్సో కేసులో 25 ఏళ్ల జైలు

POCSO Case : మైనర్ బాలికపై రేప్ అటెంప్ట్ కేసు.. పోక్సో కేసులో 25 ఏళ్ల జైలు
X

బాలికపై అత్యాచార యత్నం కేసులో నిందితుడికి 25 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ నాంపల్లిలోని పోక్సోకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2023వ సంవత్సరంలో హైదరాబాద్లోని రాజభవన్ మక్త ప్రాంతంలో మైనర్ పై శ్రీనివాస్ అనే యువకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. మైనర్ బాలికను సెల్ఫోన్ కొనిస్తానంటూ తన ఇంటికి తీసుకెళ్ళి అత్యాచారయ త్నానికి పాల్పడ్డాడు. బాలిక ప్రాణాలతో బయటపడిన తర్వాత.. తల్లిదండ్రులు నాంపల్లి పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు శ్రీనివాస్పై పోక్సో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారణ సమయంలో ఆధారాలు, సాక్ష్యాలు, బాలిక వాంగ్మూలాన్ని కోర్టు పరిగణలోకి తీసుకొంది. అలాగే వైద్య నివేదిక సైతం నిందితుడిపై అభియోగాలను నిజమేనని స్పష్టం చేశాయి. పోక్సో చట్టం కింద కేసు విచారించిన ప్రత్యేక కోర్టు.. నిందితుడు శ్రీనివాస్ దోషిగా తేల్చింది. దీంతో అతడికి 25 ఏళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది.

Tags

Next Story