Reels : రీల్స్ పిచ్చి.. పనిమనిషి ఏం చేసిందంటే?
తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ కావాలని రీల్స్ చేయాలనుకుంది ఓ పనిమనిషి. అందుకు మంచి కెమెరా కొనాలనుకుంది. కానీ డబ్బులు లేవు. ఇంకేముంది పనిచేసే ఇంటికే కన్నం వేసింది. ఢిల్లీలోని ఓ బంగ్లాలో పనిచేసే నీతూయాదవ్(30)కు సోషల్ మీడియా పిచ్చి ఎక్కువ. ఈక్రమంలోనే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫేమస్ కావాలని యజమాని ఇంట్లో చోరీ చేసింది. రూ.లక్షల విలువైన నగలతో పరారైంది. యజమాని ఫిర్యాదుతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు.
రాజస్థాన్ వాసి అయిన ఈమె డ్రగ్స్‌కు బానిసగా మారిన భర్త వేధింపులు తాళలేక దిల్లీకి వచ్చి చేరింది. సోషల్ మీడియా పిచ్చి ఉన్న నీతూ ఇన్‌స్టా రీల్స్ చేసి పోస్టు చేస్తుండేది. ఇలాకాకుండా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎక్కువ డబ్బు సంపాదించాలనుకొంది. రీల్స్ చేసేందుకు డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా కొందామంటే డబ్బు లేదు.
దీంతో యజమాని ఇంట్లో చోరీకి పాల్పడి.. బంగారం, వెండి సహా విలువైన వస్తువులతో పరారైంది. ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసుకున్న ఆమెపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగల బ్యాగుతో నగరం దాటేందుకు ప్రయత్నిస్తున్న నీతూ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com