Eluru: మైనర్‌ బాలికను వేధిస్తున్నాడనే కారణంతో ఓ యువకుడిపై దాడి..

Eluru: మైనర్‌ బాలికను వేధిస్తున్నాడనే కారణంతో ఓ యువకుడిపై దాడి..
X
Eluru: ఓ మైనర్‌ బాలికను వేధిస్తున్నాడన్న కారణంతో అజయ్‌ అనే యువకుడిని తీవ్రంగా కొట్టారు బాలిక బంధువులు.

Eluru: ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం పంగడి గూడెం గ్రామంలో ఓ మైనర్‌ బాలికను వేధిస్తున్నాడన్న కారణంతో అజయ్‌ అనే యువకుడిని తీవ్రంగా కొట్టారు బాలిక బంధువులు. దీంతో ఆ యవకుడు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు అజయ్‌ను ఏరియా అసుపత్రికి తరలించారు.

ప్రేమ పేరుతో గత కొంతకాలంగా ఓ మైనర్‌ బాలికను వేధిస్తున్నాడు అజయ్‌ అయితే బాలిక కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌ చేయడంతో ఊరి పెద్దల సమక్షంలో రాజీచేసి అజయ్‌ను మందలించారు.. అయితే గొడవ సద్దుమణిగాక కూడా తమ కుమారుడిని విచక్షణారహితంగా కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు యువకుడి తల్లిదండ్రులు.. నిందితులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు.

Tags

Next Story