నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
నల్గొండ జిల్లా చింతపల్లి క్రాస్ రోడ్డు వద్ద నార్కెట్ పల్లి- అద్దంకి హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది.

నల్గొండ జిల్లా చింతపల్లి క్రాస్ రోడ్డు వద్ద నార్కెట్ పల్లి- అద్దంకి హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గాయపడినవారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. మృతి చెందినవారిని నాగేశ్వరరావు(44), జయరావు(42), మల్లికార్జున్(40)గా పోలీసులు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story