పెళ్లి వేడుకకు వెళ్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి..!

పెళ్లి వేడుకకు వెళ్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి..!
ప్రకాశం జిల్లా కలుజువ్వపాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పెళ్లి వేడుకకు వెళ్తుండగా ఆటో నుంచి జారిపడటంతో ప్రమాదం జరిగింది.

ప్రకాశం జిల్లా కలుజువ్వపాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పెళ్లి వేడుకకు వెళ్తుండగా ఆటో నుంచి జారిపడటంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పెళ్లి కూతురు బంధువులు దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో 12 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. పెళ్లి కోసమని ఆనందంగా ఇంట్లో నుంచి బయల్దేరిన వాళ్లు... కొద్దిసేపటికే... ఇలా మృత్యువాత పడటంతో.. అంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. సోమేపల్లి నుంచి పొదిలి అక్కచెరువు వెళ్తుండగా కలుజువ్వపాడులో ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుక కోసం పెళ్లి కూతురుతో కలిసి... ఆమె బంధువులు పొదిలి అక్కచెరువుకు వెళ్తున్నారు. కాసేపట్లో పెళ్లి అనగా... ఈ ప్రమాదం జరగడంతో... ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటన స్థలంలో పెళ్లి కూతూరు కన్నీరుమున్నీరుగా విలపించడం... అక్కడ ఉన్న అందరినీ కలచివేసింది.

Tags

Read MoreRead Less
Next Story