టిప్పర్ ను ఢీకొన్న కారు.. నలుగురు మృతి

టిప్పర్ ను ఢీకొన్న కారు.. నలుగురు మృతి
X
హైదరాబాద్ శివారులోని నార్సింగి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్ శివారులోని నార్సింగి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు ఆగి ఉన్న టిప్పర్ ను ఢీకొనడంతో ఇద్దరు అక్కచెల్లెళ్లతో సహా నలుగురు మృతి చెందారు.నార్సింగి సీబీఐటీ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిజాంపేటకు చెందిన విద్యార్థులు కారులో ప్రయాణిస్తూ సీబీఐటీ సమీపంలో ఆగి ఉన్న టిప్పర్ ను ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అప్రమత్తమైన స్థానికులు కారులో ఇరుక్కుపోయిన ఇతర విద్యార్థులను రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Tags

Next Story