ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో రోడ్డు ప్రమాదం..!

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో రోడ్డు ప్రమాదం..!
ఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి.

ఖమ్మం జిల్లా కొణిజర్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. అతివేగంతో దూసుకొచ్చిన కారు.. ఆటో, బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.. బైక్‌పై వెళ్తున్న అన్నా చెల్లెలు స్పాట్‌లోనే చనిపోగా, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు.. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామానికి చెందిన వెంకన్న, తన చెల్లెలు.. ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి శుభకార్యానికి వెళ్లివస్తున్నారు.. వెనుక నుంచి అతి వేగంగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టి అదే వేగంతో బైక్‌ను గుద్దింది.

వెంకన్న స్పాట్‌లోనే చనిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా లక్ష్మి చనిపోయింది. అదే సమయంలో ఖమ్మం నుంచి వైరా వైపు వస్తున్న ఎంపీ నామా నాగేశ్వరరావు.. విషయం తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టారు.. ఇద్దరు చిన్నారులను అంబులెన్స్‌ ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అన్నాచెల్లెలు మృతిచెందడంతో పల్లిపాడు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story