నల్గొండ రోడ్డు ప్రమాదం : సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి!

నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కూలీలు వరినాట్ల కోసం రంగారెడ్డిగూడెం వెళ్లి వస్తుండగా హైదరాబాదు-నాగార్జునసాగర్ హైవే అంగడిపేట స్టేజ్ దగ్గర ప్రమాదం జరిగింది. ఆటో.. బొలెరోను తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఆటోలో సుద్దబావితండాకు చెందిన 21 మంది ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
ఘటనాస్థలాన్ని దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి పరిశీలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ రోడ్డు ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాల పాలై చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు.
మృతిచెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
1. మల్లేశం (ఆటోడ్రైవర్)
2. నోమల పెద్దమ్మ
3. నోమల సైదమ్మ
4. కొట్టం పెద్దమ్మ
5. గొడుగు ఇద్దమ్మ
6. మల్లమ్మ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com