ఆంధ్ర,కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం..!

ఆంధ్ర,కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం..!
బెంగుళూరు-కడప రహదారిపై చింతామణి సమీపంలోని నందిగానిపల్లె గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు-కడప రహదారిపై చింతామణి సమీపంలోని నందిగానిపల్లె గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. రాయలపాడు నుంచి చింతామణికి ప్రయాణీకులతో వెళుతున్న జీపు బెంగుళూరు నుంచి నెల్లూరుకు వెళుతున్న లారీ వేగంగా ఢీకొనడంతో జీపులో ఉన్నవారు మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని చింతామణి ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. చింతామణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story