Mancherial: మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో యువతి మృతి..

X
Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం యువతి ప్రాణం తీసింది. బెల్లంపల్లి బస్టాండ్ సమీపంలో వేగంగా వస్తున్న బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో యువతి స్పాట్‌లోనే చనిపోయింది. మృతురాలిని కన్నాలబస్తీకి చెందిన భవజ్ఞగా గుర్తించారు. యువతి మంచిర్యాలలోని వైష్ణవి డయాగ్నోస్టిక్స్‌లో పనిచేస్తోంది. మృతురాలి తండ్రి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కూతురి మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
