Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ పైదాడి దుండగుడు దొరికాడు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన దుండగుడి ఆచూకీ లభ్యమైందని తెలు స్తోంది. ఈ మేరకు పోలీసులు అతడిని విచారిస్తున్నా రని సమాచారం.ముంబైలో ఎక్కువగా సంపన్నులు నివాసం ఉండే బాంద్రా వెస్ట్ లోని సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులో సైఫ్ సొంత ఫ్లాట్లోకి గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఒక దుండగుడు దూరడం ఆపై సైఫ్ అలీ ఖాన్పై విచ క్షణంగా దాడి చేయడంతో ఈ ఘటనలో నటుడికి తీవ్రగాయాలయ్యాయి. జీన్స్, టీ-షర్టు ధరించిన దుండుగుడు సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలోకి ప్రవేశించాడు. తొలుత తనను గమనించి కేకలు వేసిన పని మనిషి ఎలియామ ఫిలిపైస్పై కత్తితో దాడి చేశాడు. ఆమెను బంధించాడు. కోటి రూపాయలు ఇస్తేనే వదిలేస్తానంటూ బేరం పెట్టాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న సైఫ్ అదేమీ పట్టించుకోకుండా అతడిని ధైర్యంగా ఎదిరించాడు. ఈ క్రమంలో దుండగుడు కత్తితో విచక్షణారహితం గా సైఫన్ను పొడిచి తక్షణమే మెట్ల మార్గం గుండా పరారయ్యాడు. సైఫ్ ను లీలావతి ఆస్పత్రికి తరలిం చగా శస్త్ర చికిత్సలు చేశారు. ఆయనకు ఆరుచోట్ల గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. మెడ, వెన్ను ముక భాగంలో సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుని ఇంటికి చేరుకుంటారని వెల్లడించారు. ఇదిలా ఉండగా నిందితుడిపై బీఎ న్ఎస్ 331(4), సెక్షన్ 311 కింద కేసు పెట్టారు. సాక్ష్యాధారాల కోసం సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరి శీలించారు. సైఫ్పై దాడి తర్వాత దుండగుడు మెట్లు దిగి పారిపోయినట్లు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com