Saif Ali Khan : రూ.కోటి ఇవ్వనుందుకే సైఫ్‌పై దాడి

బాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంట్లోకి చొరబడిన నిందితుడు సైఫ్ అలీఖాన్‌ను కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కోటి ఇచ్చేందుకు సైఫ్ ఒప్పుకోకపోవడంతోనే దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరోవైపు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా సైఫ్ ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజీ విడుదల చేశారు. అందులో నిందితుడిని గుర్తించారు. సంబంధిత వీడియోలో నిందితుడు మెట్లు దిగితూ కనిపించాడు. తెల్లవారుజామున 2.33 గంటలకు నిందితుడు మెట్లు దిగి వెళ్తున్నట్టు ఫుటేజీలో కనిపించింది. బ్యాగ్ తగిలించుకుని, స్కార్ఫ్ భుజంపై వేసుకుని కనిపించాడు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాడే అత్యవసర మెట్ల మార్గంలో నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com