SBI Bank : బ్యాంకుకు రూ. 50 లక్షల టోకరా.. నిందితుడైన ఉద్యోగి అరెస్ట్

SBI Bank : బ్యాంకుకు రూ. 50 లక్షల టోకరా.. నిందితుడైన ఉద్యోగి అరెస్ట్
X

హైదరాబాద్ నగరంలో ఎస్బీఐ బ్యాంకును మోసగించి 20 ఏళ్లుగా మారువేశాలతో తిరుగుతున్న నిందితుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. 2002లో హైదరాబాద్ లోని ఓ ఎస్బీఐ బ్రాంచి లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన చలపతిరావు నకిలీ పత్రాలు సృష్టించి తన బంధువులకు రూ.50 లక్షల రుణం ఇప్పించాడు. రుణం ఇప్పించిన తరువాత నిందితుడు పరారయ్యాడు.

ఈ క్రమంలో 2004 లో నిందితుడిపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు అతడి భార్యను సైతం నిందితురాలిగా చేర్చింది. అయితే, తన భర్త కనిపించడం లేదంటూ కామ టిపుర పీఎస్ లో 2004లో అతడి భార్య ఫిర్యాదు చేసింది. ఏడేళ్ళుగా కనిపించకుండా పోయిన తన భర్త ను చనిపోయినట్లు ప్రకటించాలని కోర్టులో పిటిషన్ సైతం వేసింది. దీంతో చనిపోయినట్లు గుర్తించాలని న్యాయస్థానం ఉత్తర్వులు సైతం జారీ చేసింది.

అయితే చలపతిరావు 20ఏళ్లుగా పేర్లు మార్చుకుని మారు వేశంలో తప్పించుకు తిరుగుతుండగా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చలపతిరావు జీమెయిల్, ఫోన్ నంబర్లను ట్రాక్ చేసిన సీబీఐ అధికారులు శ్రీలంక పారిపోతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆగస్టు 4న తమిళనాడులో అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చి రిమాండ్ తరలించారు.

Tags

Next Story