TG : సాప్ట్‌వేర్ ఎంప్లాయ్ రేప్ కేసు.. రేపిస్ట్ కోసం గాలింపు

మద్యంమత్తులో సాప్ట్ వేర్ ఉద్యోగి అత్యాచారం కేసులో నిందితుడు ఎడ్ల గౌతంరెడ్డిని రిమాండ్ కు తరలించి, మరో నిందితుడు మునగాల శివాజీ రెడ్డి కోసం రెండు బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలను మమ్మురం చేశారు. పోలీసులు తెలిపిన ప్రచారం చౌటుప్పల్ కు చెందిన ఎడ్ల గౌతం రెడ్డి (24) మన్సురాబాద్ డివిజన్ కేవీఎన్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటాడు. హయత్ నగర్ లక్ష్మారెడ్డి కాలనికి చెందిన చిన్ననాటి స్నేహితురాలైన క్లాస్ మేట్ (24)కు గచ్చిబౌలి లోని సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం లభించింది. ఈ సందర్భంగా పార్టీ అడగడంతో ఇద్దరు చింతలకుంట యశోదా నగర్ లోని హోటల్ బొమ్మరిల్లు నాలుగో ఫ్లోర్లో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవించారు.
ఆ తర్వాత మూడో అంతస్తులో బుక్ చేసుకున్న రూమ్ కు ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. గౌతమ్ రెడ్డి మద్యంమత్తులో అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గమనించి స్నేహితుడు చౌటుప్పల్ మండలం ఆరె గూడెం గ్రామానికి చెందిన మునగాల శివాజీ రెడ్డి అలియాస్ చింటూ రెడ్డి (30)కి ఫోన్ చేసి హోటల్ కు పిలిపించుకుని యువతపై లైంగిక దాడిచేశారు. స్పృహలోకి రాగానే రూమ్ లో ఉన్న ఇద్దరిని చూసి బాధితురాలు కేకలు చేసింది. దీంతో ఆ ఇద్దరు పరారయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ భాగ్యలత కాలనీలోని మైత్రి రెసిడెన్సీలో నివాసం ఉంటున్నాడు చింటూరెడ్డి.
హోటల్ సిబ్బంది, యువతి మరో స్నేహితుడికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. యువతి ఫిర్యాదు మేరకు పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. వనస్థలిపురం పోలీసులు రంగంలోకి దిగి గౌతంరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా అత్యాచారం విషయాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుండి ఐఫోన్ రాయల్ ఎన్ ఫీల్డ్ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని గౌతమ్ రెడ్డిని రిమాండ్ కు తరలించారు. స్నేహితుడు శివాజీ రెడ్డి కోసం రెండు బృందాలుగా గాలింపు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com