Sedition Case : సీనియర్ జర్నలిస్టులు వరదరాజన్, కరణ్ థాపర్‌పై దేశద్రోహం కేసు నమోదు

ప్రముఖ జర్నలిస్టులు సిద్ధార్థ వరదరాజన్, కరణ్ థాపర్లపై దేశద్రోహం కేసు నమోదైంది. అస్సాం పోలీసులు వారిపై ఈ కేసును నమోదు చేశారు. అస్సాం ప్రభుత్వంపై ఒక ప్రత్యేక నివేదికను ప్రచురించినందుకు గాను, వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 152 కింద దేశద్రోహం ఆరోపణలు మోపారు. ఈ సెక్షన్ దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా చేసే చర్యలకు సంబంధించినది. ఈ కేసు విచారణలో భాగంగా ఆగస్టు 22న గౌహతిలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి హాజరు కావాలని వారికి సమన్లు జారీ అయ్యాయి. తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీని ఇవ్వకుండా విచారణకు హాజరు కావాలని కోరడం చట్టవిరుద్ధమని జర్నలిస్టులు పేర్కొన్నారు. తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కేసు నమోదును ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (PCI)తో సహా పలు పత్రికా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మీడియా స్వేచ్ఛను అణిచివేయడానికి ఇలాంటి చట్టాలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని వారు ఆరోపించారు. స్సాంలో వరదరాజన్‌పై ఇలా కేసు నమోదు కావడం ఇది రెండోసారి. గతంలో ఒక బీజేపీ నాయకుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కాగా, ఆ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించింది. ప్రస్తుతం ఈ విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది, ప్రభుత్వం పాత్రికేయుల స్వేచ్ఛను అణచివేస్తుందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com