TG : నకిలీ మద్యం బాటిళ్ల కోసం లేబుల్స్ తయారీ యంత్రాలు సీజ్

TG : నకిలీ మద్యం బాటిళ్ల కోసం లేబుల్స్ తయారీ యంత్రాలు సీజ్
X

మద్యం బాటిళ్ల లేబుల్స్ 7 తయారు చేస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు ఇవాళ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం అరెస్ట్ చేసింది. లేబుల్స్ తయారు చేసే మిషన్లను సైతం స్వాధీనం చేసుకుంది. ఇటీవల సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కల్తీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన ఆధారాలు, లేబుల్స్ ను పరిగణలోకి తీసుకొని ఎన్డీఎఫ్ అధికారి అంజి రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు లేబుల్స్ ఎక్కడ తయారు చేస్తున్నారనే విషయమై ఆరా తీశారు. కొన్ని రోజులుగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మల్కాజిగిరి డివిజన్ కు షాయిగూడలో రహస్యంగా మద్యం లేబుల్స్ ను తయారు చేస్తున్న యూనిట్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ యూనిట్ గడ్డ మీది నవీన్ గౌడ్ అనే వ్యక్తికి సంబంధించిం దిగా గుర్తించారు. శివ సాయి నగర్ కాలనీ, నాగార్జున కాలనీ, కుషాయిగూడ ప్రాంతాల్లో లేబుళ్ల తయారీకి సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఫ్యాక్టరీలో మల్టీ కలర్ మిషన్లుతో పాటు 15 రకాల సామా గ్రిని స్వాధీనం చేసుకున్నారు. రాయల్ స్ట్రాంగ్ కు సంబంధించినవి 8 ప్లేట్లు, ఏసీ బ్లాక్ ఏపీకి చెందిన బ్లాక్ మన ప్లేయర్స్ ను స్వాధీనం చేసు కున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో కుషాయిగూడకు చెందిన గడ్డమీద ప్రకాశ్, నివావత్ రాజేన న్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

Tags

Next Story